పాదరక్షలు ఎంచుకోండిలా
close
Published : 24/06/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాదరక్షలు ఎంచుకోండిలా

వానాకాలంలో కాలిని పూర్తిగా కప్పేసే బూట్లు, చెప్పులకు దూరంగా ఉండాలి. వీటితో వానలో తడిస్తే ఇబ్బందే. నీటిని పీల్చుకుని బరువుగా మారతాయి. త్వరగా ఆరవు. దాంతో వాటిలో సూక్ష్మ జీవులు ఆవాసం ఏర్పరుచు కుంటాయిక్కడ. ఈ కాలంలో చెప్పుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లకు రక్షణతోపాటు అందంగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. స్టైలిష్‌గా ఉండటమూ తప్పనిసరి. మరి అలాంటి వాటిని ఎలా ఎంచుకోవాలి?

ఫ్లిప్‌ఫ్లాప్స్‌... ఈ కాలంలో ఫ్లిప్‌ఫ్లాప్స్‌ చక్కటి ఎంపిక. వీటిపై నీళ్లు నిలిచి ఉండవు. త్వరగా ఆరిపోతాయి.

శాండిల్స్‌:  తడిచినా త్వరగా ఆరిపోతాయి. ఇబ్బంది పెట్టవు. స్ట్రాప్స్‌ను పెట్టి, తీయడం కూడా సులువే.

క్లాగ్స్‌...  వీటికి ఉండే రంధ్రాల  వల్ల ఇవి ఎప్పుడూ పొడిగానే ఉంటాయి. తేలికగానూ, వాటర్‌ ప్రూఫ్‌గానూ ఉంటాయి. సౌకర్యంతోపాటు స్టైలిష్‌గానూ కనిపిస్తాయి.

* ఈ కాలంలో తడిచిన చెప్పులు, బూట్లు ఆరడానికి సమయం పడుతుంది. అప్పుడు వాటి నుంచి దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. అలా కాకుండా వోడర్‌ రెసిస్టెంట్‌ రకాలను ఎంచుకుంటే మేలు.

* వాటర్‌ ప్రూఫ్‌ రకాలు.. తేలికగా ఉండే మన్నికైన వాటర్‌ప్రూఫ్‌ పాద రక్షలను తీసుకోవాలి. ఎందుకంటే వీటిని సులువుగా శుభ్రం చేసి ఆరబెట్టొచ్చు కూడా.

* రబ్బరు సోల్‌ ఉండే బూట్ల రకాలను ఎంచుకుంటే సరి. ఇవి వాటర్‌ప్రూఫ్‌గానూ ఉండి నీటిని నిలవనీయవు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని