Viral video: ఈ జిమ్నాస్టిక్స్‌లో చివరి సెకన్లు చూడండి - girl gymanstics sehwag
close
Published : 16/08/2021 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Viral video: ఈ జిమ్నాస్టిక్స్‌లో చివరి సెకన్లు చూడండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: జిమ్నాస్టిక్స్‌ అంటేనే విన్యాసాల క్రీడ. క్రీడాకారులు ఈ పోటీల్లో వివిధ రకాలైన విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. వీటిని చూస్తూ మనం రెప్పపాటు వేయడం కూడా మర్చిపోతాం. ఇక్కడ మీరు చూస్తున్న చిన్నారి జిమ్నాస్టిక్స్‌ చేస్తూ అందరిని అబ్బురపరచడమే కాదు.. అంతర్జాతీయ క్రీడావేదిక ఒలింపిక్స్‌లో ఏకంగా ఐదుసార్లు స్వర్ణం సాధించిన 59ఏళ్ల నదియా కొమనేసి మనసు దోచింది కూడా. తాజాగా ఆమెతో పాటు భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం ఈ వీడియోని రీట్వీట్‌ చేశారు. ఈ స్టంట్స్‌ జిమ్నాస్టిక్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో చేసిన దృశ్యాలు. రెడ్‌ షర్ట్‌, స్వెట్‌ ప్యాంట్స్‌తో శరీరాన్ని స్ప్రింగ్‌లా తిప్పుతున్న ఈ వీడియోని ట్విటర్‌లో ఇప్పటి వరకూ 4.7 మిలినయ్ల వ్యూస్‌ దక్కించుకుంది. ఏకధాటిగా 1.11 నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో ఆ ఆఖరి సెకన్ల స్టంట్ ఏదైతో ఉందో అదే హైలైట్‌. మరి ఆ స్టంట్‌ని మీరు వీక్షించండి.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని