మోదీజీ ప్రసంగాలు కాదు.. పరిష్కారం చెప్పండి - give country solution not hollow speeches rahul gandhi to govt on covid-19 situation
close
Published : 22/04/2021 11:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీజీ ప్రసంగాలు కాదు.. పరిష్కారం చెప్పండి

రాహుల్‌గాంధీ విమర్శలు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ అలసత్వం, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసంగాల వల్ల ఎలాంటి లాభం లేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పరోక్షంగా విమర్శలు సంధించిన ఆయన.. ఈ సంక్షోభానికి పరిష్కారం చూపాలని ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. 

‘‘నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. దేశం నలుమూలల నుంచి బాధాకరమైన వార్తలు నిరంతరం వినాల్సి వస్తోంది. ఈ సంకట పరిస్థితులకు కారణం కరోనా ఒక్కటే కాదు.. కేంద్ర సర్కారు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా. పనికిరాని ఉత్సవాలు (మోదీ పిలుపునిచ్చిన టీకా ఉత్సవ్‌ను ఉద్దేశించి), పస లేని ప్రసంగాలు కాదు.. సంక్షోభానికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఏర్పడింది’’ అని రాహుల్‌ మండిపడ్డారు. 

దేశంలో కొవిడ్‌ మహమ్మారి విలయం కొనసాగుతున్న వేళ గత సోమవారం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించిన ప్రసంగించిన విషయం తెలిసిందే. దేశాన్ని లాక్‌డౌన్‌ నుంచి మనకు మనమే కాపాడుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ను రాష్ట్రాలు చివరి అస్త్రంగానే ప్రయోగించాలని ప్రధాని సూచించారు. అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరత ఉందని, సరిపడా ఆక్సిజన్‌ సరఫరా కోసం కృషిచేస్తున్నామని, అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆక్సిజన్‌ అందించే దిశగా పనిచేస్తున్నామన్నారు. ఈ ప్రసంగంపైనే రాహుల్‌ నేడు పరోక్ష విమర్శలు చేశారు. గతవారం కరోనా సోకడంతో అప్పటి నుంచి ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని