నేను 70ల్లో ఉన్నా..యువతకి టీకా ఇవ్వాలి:ఖర్గే - give vaccine to youngsters
close
Published : 01/03/2021 23:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను 70ల్లో ఉన్నా..యువతకి టీకా ఇవ్వాలి:ఖర్గే

కరోనా టీకా వేయించుకున్న ప్రముఖులు

దిల్లీ: కరోనా టీకా అందించే విషయంలో వృద్ధులకు కాకుండా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. సోమవారం కరోనా టీకా తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నా వయసు 70 సంవత్సరాలు పైబడింది. నాకు కాకుండా ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతకు కరోనా టీకా అందించాలి. నేనింకో పది పదిహేనేళ్లు జీవిస్తానేమో’ అంటూ ఖర్గే అన్నారు. 

టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి:

చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ.. అర్హులందరూ తప్పకుండా టీకా తీసుకోవాలని సూచించారు. 

ముఖ్యమంత్రులు కూడా..
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేడు టీకా తీసుకున్నారు. ‘ఈ రోజు నేను కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ నవీన్ పట్నాయక్ టీకా వేయించుకుంటున్నప్పటి చిత్రాన్ని షేర్ చేశారు. అలాగే వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తల సేవలను కొనియాడారు. అర్హులైన ప్రతిఒక్కరు టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి ప్రారంభమైన రెండో దశ కరోనా టీకా కార్యక్రమం కింద ప్రధాని మోదీ టీకా మొదటి టీకా డోసు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పలువురు నేతలు కూడా టీకాలు వేయించుకున్నారు. 60 ఏళ్లు పైబడినవారికి, 45 నుంచి 59 సంవత్సరాల వయసులోపున్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు ఈ రోజు నుంచి టీకా ఇస్తున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని