కరోనాతో మహిళ మృతి.. ఆభరణాలు మాయం - gold and diamond jewellery missing in hospital from who dead with corona
close
Published : 03/08/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో మహిళ మృతి.. ఆభరణాలు మాయం

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఘటన

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. రెండ్రోజుల కిందట కరోనాతో ఆ ఆసుపత్రిలో బాధిత మహిళ చేరింది. చికిత్స పొందుతూ మహిళ ప్రాణాలు విడిచింది. మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగలు, వజ్రాల చెవి కమ్మలు మాయం అయినట్లు బంధువులు ఆరోపించారు. ముక్కుపుడక కూడా మాయమైనట్లు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని