Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు - good night news at nine pm
close
Published : 29/07/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. ఒక్క రూపాయికే ఇల్లు ఇవ్వటం కొందరికి నచ్చటం లేదు: బొత్స

ఒక్క రూపాయికే పేదలకు ఇళ్లు ఇవ్వటం కొందరికి నచ్చటం లేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టిడ్కో ఇళ్లకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో రూ.480 కోట్లు ప్రజాధనం పొదుపు అయ్యాయని, ఇవేవీ ప్రతిపక్షాలు సహించటం లేదని విమర్శించారు. పేదలకు 340 చదరపు అడుగుల ఇళ్లు ఇస్తుంటే పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చేందుకు  ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ప్రయత్నిస్తోందన్నారు.

కొత్తగా 1,180 పోస్టుల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం

2. ఒంటరి మహిళలే లక్ష్యం... ప్రతిఘటిస్తే కిరాతకంగా హత్య

ఒంటరి మహిళలే ఆ దంపతుల లక్ష్యం. బంగారం, వెండి ఆభరణాల కోసం కిరాతకానికి పాల్పడేవారు. ప్రతిఘటిస్తే అత్యంత కిరాతకంగా హత్య చేస్తారు. మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో లేబర్‌ అడ్డా వద్ద ఓ మహిళ అపహరణ, హత్యోదంతం ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు గతంలో వీరి నేర చరిత్రపై ఆరా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బాలానగర్‌ డీసీపీ పద్మజ మీడియాకు వెల్లడించారు. 

3. హైకోర్టులో దేవినేని ఉమా బెయిల్‌ పిటిషన్‌

మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసులు తనపై  హత్యాయత్నం, కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అన్యాయంగా పెట్టారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వ్యాజ్యంలో పేర్కొన్నారు. కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. పిటిషనర్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. మాజీ మంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు.

4. బావిలో కారును బయటకు తీసిన అధికారులు

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మల్కనూరు వద్ద ఈ ఉదయం బావిలోకి  దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశారు. బావిలో 60 అడుగుల మేర నీరు ఉండటంతో కారును బయటకు తీయడం  అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కష్టంగా మారింది. దాదాపు 8గంటల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. కారు అద్దాలు తెరచి చూడగా.. కారులో ఒక్కరే ఉన్నట్టు గుర్తించారు.

5. 8.72లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ

కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 8.72లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ గురువారం వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2020 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం 40,04,941 పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 31,32,698 ఉద్యోగులు ఉన్నట్లు ఆయన తెలిపారు. 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. 

6. బ్రిటన్‌ ప్రధాని మాట వినని గొడుగు

బ్రిటన్ ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్‌ను ఓ గొడుగు బాగా ఇబ్బంది పెట్టింది. పోలీసు మెమోరియల్ వేడుకల్లో బ్రిటన్ ప్రధాని పాల్గొనగా వాతావరణం చల్లబడి చినుకులు పడ్డాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న గొడుగును బొరిస్ తెరవగా అది వెంటనే మూసుకుపోయింది. తిరిగి తెరవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గొడుగుతో ప్రధాని పడుతున్న అవస్థలు చూసి అక్కడి అధికారులు నవ్వుకున్నారు. ఆ సమయంలో బొరిస్ పక్కనే ఉన్న ప్రిన్స్ చార్లెస్ సైతం బొరిస్ పాట్లు చూసి చిరు నవ్వులు చిందించారు. 

7. ఐఫోన్‌ టు ఆండ్రాయిడ్..ఛాట్ ట్రాన్స్‌ఫర్ చిక్కులు లేనట్లే!

గత కొద్ది నెలలుగా వాట్సాప్‌ వరుసగా కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ యూజర్స్‌ని ఆకట్టుకుంటోంది. ఆర్కైవ్ అప్‌డేట్, గ్రూప్ వీడియోకాలింగ్ వంటి ఫీచర్స్‌ని ఇప్పటికే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవేకాకుండా మల్టీ డివైజ్‌ సపోర్ట్, వ్యూవన్స్‌, వాయిస్ మెసేజ్ రివ్యూ, రిక్వెస్ట్ ఏ రివ్యూ ఫీచర్స్‌ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా ఈ జాబితాలోకి మరో కొత్త ఫీచర్ వచ్చి చేరనుంది. యూజర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఛాట్ ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్‌ను తీసుకురానుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. 

8. తెలుగు సహా 5 భాషల్లో ఇంజినీరింగ్‌ బోధన!

దేశంలోని పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత సరళీకృతం చేయడంలో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌ కోర్సులను ఐదు భాషల్లో బోధించనున్నట్టు వెల్లడించారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యా బోధన ఐదు భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతుండటం సంతోషకరమన్నారు. హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యా బోధన ప్రారంభమవుతుందని చెప్పారు.

9. రెండో వివాహంపై స్పందించిన నటుడు సుమంత్‌

తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై నటుడు సుమంత్‌ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. సుమంత్‌ వెడ్స్‌ పవిత్ర పేరుతో ఒక పెళ్లి ఆహ్వాన పత్రిక గత 24గంటలుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ పెళ్లి కార్డును చూసి చాలామంది సుమంత్‌ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ భావించారు. ఈ క్రమంలో సుమంత్‌ రెండో పెళ్లి పేరుతో వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలోనూ భిన్నరకాలుగా పోస్టులు దర్శనమిచ్చాయి.

10. ట్విటర్‌లో ప్రధాని మోదీ అరుదైన ఫీట్

ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్‌లో కీలక మైలురాయిని చేరుకున్నారు. ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఒకరిగా నిలిచారు. ఆయన్ను అనుసరించేవారి సంఖ్య బుధవారంతో ఏడుకోట్ల(70 మిలియన్లు) మార్కును దాటింది. గుజరాత్ మఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009లో మోదీ ట్విటర్‌ ఖాతాను ప్రారంభించారు. 2010 నాటికి ఆయన్ను అనుసరించేవారి సంఖ్య లక్షగా ఉంది. పది సంవత్సరాలు అంటే 2020లో ఆ సంఖ్య ఆరు కోట్ల(60 మిలియన్లు)కు చేరింది. ఇప్పుడా సంఖ్య ఏడు కోట్లను దాటింది.

పార్టీలకు ‘యంగ్‌ తరంగం’: సీనియర్లను పక్కన పెడుతున్నపార్టీలుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని