కీర్తి కూడా వచ్చేస్తున్నారు..! - goodluck sakhi release date announcement
close
Published : 01/03/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీర్తి కూడా వచ్చేస్తున్నారు..!

హైదరాబాద్‌: క్రీడా నేపథ్యంలో సాగే చిత్రాలు వెండితెరపై తరచూ చూస్తూనే ఉంటాం. అలాంటి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘గుడ్‌లక్‌ సఖి’. కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించారు. ఈఏడాది జూన్‌ 3న ‘గుడ్‌లక్‌ సఖి’ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఆటల నేపథ్యంలో రొమాంటిక్‌ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో మెరవనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సుధీర్‌చంద్ర పాదిరి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని