Gopichand: ‘పక్కా కమర్షియల్‌’ లుక్‌ - gopichand new look from pakka commercial
close
Published : 11/06/2021 18:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gopichand: ‘పక్కా కమర్షియల్‌’ లుక్‌

ఇంట‌ర్నెట్ డెస్క్: గోపీచంద్ కథానాయకుడిగా మారుతి తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. రాశీ ఖ‌న్నా నాయిక‌. గీతా ఆర్ట్స్‌-2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జూన్ 12 గోపీచంద్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక‌రోజు ముందుగానే అభిమానులకు స‌ర్‌ప్రైజ్ అందించింది చిత్ర బృందం. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా గోపీచంద్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ని పంచుకుంది. ఇందులో డ్యాన్స్ చేస్తూ క‌నిపించాడు గోపీచంద్. క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని, ట‌క్ చేసుకుని క్లాస్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నాడు. ఓ పాట‌కు సంబంధించిన స‌న్నివేశంలోని ఫొటో ఇది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. మ‌రి ఆ అదిరిపోయే పాట ఏంటో వినాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని