మ‌రొక‌రి స్థానంలో జయం విల‌న్‌గా - gopichand role in jayam
close
Published : 16/05/2021 15:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ‌రొక‌రి స్థానంలో జయం విల‌న్‌గా

ఇంట‌ర్నెట్ డెస్క్‌ :కొన్ని చిత్రాల్లో క‌థానాయ‌కుడి పాత్ర‌ ఎంత ప్ర‌భావం చూపుతుందో ప్ర‌తినాయ‌కుడి పాత్రా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది. ఇలాంటి పాత్రే జయం సినిమాలో గోపీచంద్ పోషించింది. వెంక‌ట్ చెయ్యి గుర్తు అంటూ నితిన్‌ త‌న ప్రేమ కోసం చేసిన పోరాటాన్ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రిచిపోలేరు. గోపీచంద్‌.. నాయిక స‌దా బావ‌గా ర‌ఘు పాత్ర‌లో విల‌నిజం పండించి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు . ముందుగా ఈ విల‌న్ రోల్ కోసం బాలీవుడ్ న‌టుడ్ని ఎంపిక చేశారు ద‌ర్శ‌కుడు తేజ‌. అత‌నిపై రెండు మూడు రోజులు చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. కానీ తేజ అనుకున్నట్టు అత‌ను న‌టించ‌లేక‌పోయాడు. దాంతో మ‌రొక‌రి కోసం అన్వేషిస్తుండ‌గా తేజ అసిస్టెంట్ ఒక‌రు గోపీచంద్ పేరుని సూచించారు . ఓ రోజు గోపీచంద్‌కి ఫోన్ చేసి ఆడిష‌న్‌కి ర‌మ్మ‌న్నారు తేజ‌. వెంట‌నే కార్యాల‌యానికి వెళ్లిన గోపీచంద్‌కి హెయిర్ స్టైల్ చేయించి, పాత్ర‌కు స‌రిపోతావు అని చెప్పి మ‌రుస‌టి రోజు షూటింగ్‌లో పాల్గొన‌మ‌న్నారు తేజ‌. అలా జ‌యం అవ‌కాశం గోపీచంద్‌కి వ‌చ్చింది. త‌న కెరీర్‌నే ఓ మ‌లుపు తిప్పింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని