PSPK29: రేసుగుర్రం టీమ్‌తో పవన్‌ - gossips on pawankalyan next project
close
Updated : 21/02/2021 14:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PSPK29: రేసుగుర్రం టీమ్‌తో పవన్‌

జోరందుకున్న ప్రచారం

హైదరాబాద్‌: సినిమాల విషయంలో జోరు పెంచారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌. వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ ఒకదాని తర్వాత మరొకటి పట్టాలెక్కించేస్తున్నారు. ఇప్పటికే ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌, క్రిష్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్న పవన్‌ మరి కొద్ది నెలల్లో హరీశ్‌ శంకర్‌ సినిమా షూట్‌లో భాగం కానున్నారు. ఈ క్రమంలోనే పవన్‌ తన 29వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సురేందర్‌ రెడ్డితో చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘రేసుగుర్రం’ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్‌రెడ్డి, వక్కంతం వంశీ కాంబో #PSPK29 ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పవర్‌స్టార్‌కు సెట్‌ అయ్యేలా ఓ కథను వంశీ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి

ఆదివారం వంశీ పుట్టినరోజు సందర్భంగా.. పలువురు నెటిజన్లు, సినీ విశ్లేషకులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. బర్త్‌డే విషెస్‌ పోస్టులు పెడుతూ #PSPK29 అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. దీంతో పవన్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌ను వక్కంతం వంశీ కథతో ఓకే చేసేశారని అందరూ చెప్పుకుంటున్నారు. మరోవైపు.. హరీశ్‌ శంకర్‌ తర్వాత పవన్‌, పూరీ జగన్నాథ్‌తో సినిమా చేసే అవకాశాలున్నాయంటూ కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని