Bollywood: ప్రేమ కథ చెబుతారట - gossips on ranveer new movie title
close
Published : 04/06/2021 10:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: ప్రేమ కథ చెబుతారట

ముంబయి: కరణ్‌ జోహార్‌... ఈయన ప్రేమ కథలు తెరకెక్కిస్తే... అందరూ జోహార్‌ చెప్పాల్సిందే. ‘కుచ్‌.. కుచ్‌ హోతా హై’ నుంచి మొదలైంది ఈయన ప్రేమ వర్షం. ఈ కథలను అందంగా, హృద్యంగా చెప్పడంలో కరణ్‌కు తిరుగులేదంటారు బాలీవుడ్‌ వర్గాలు. ఇప్పుడు కరణ్‌ జోహర్‌ మరో రొమాంటిక్‌ కామెడీ ప్రేమ కథను చూపించడానికి సిద్ధమయ్యారు. రణ్‌వీర్‌సింగ్, అలియా భట్‌ ఇందులో ప్రేమ పక్షులు కానున్నారు. పరిస్థితులన్నీ బాగుంటే.. ఈ నెలలోనే ఇది సెట్స్‌ మీదికి వెళ్లేది. కరోనా-లాక్‌డౌన్‌ల నుంచి ఉపశమనం లభించగానే దీని చిత్రీకరణ ప్రారంభిస్తారని, ఇందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు ‘ప్రేమ్‌ కహానీ’ అనే టైటిల్‌ పరిశీలన ఉంది. ఈ చిత్రంలో నటించడానికి రణ్‌వీర్, అలియా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని