corona: భారత్‌ వేరియంట్‌ అనే కంటెంట్‌ తొలగించండి - govt asks social media platforms to remove content mentioning indian variant of coronavirus
close
Published : 23/05/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

corona: భారత్‌ వేరియంట్‌ అనే కంటెంట్‌ తొలగించండి

సామాజిక మాధ్యమాలకు కేంద్రం లేఖ

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో భారత్‌ వేరియంట్ అని ప్రస్తావించే కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం ఆయా సంస్థలను ఆదేశించింది. దీనివల్ల కొవిడ్‌ 19కు సంబంధించిన తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ అన్ని సామాజిక మాధ్యమాల ప్రతినిధులకు లేఖ పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బి.1.617 వేరియంట్‌ను ఏ నివేదికలోనూ భారత్‌ వేరియంట్‌గా ప్రస్తావించలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మే 12న పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేసిందని కూడా అందులో ప్రస్తావించారు. వివిధ దేశాల్లో దీనిపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలని సూచించారు. భారత్‌ వేరియంట్‌ పేరిట ఉన్న కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కేంద్రం ఆదేశించింది. గతంలో కూడా ఐటీ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో కరోనా వైరస్‌ గురించి వ్యాప్తి చెందుతున్న అసత్య సమాచారాన్ని అరికట్టేందుకు పలు సూచనలు చేసింది.

కాగా భారత్‌లో గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లకు పెద్ద సంఖ్యలో వినియోగదారులున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్‌లో 53 కోట్ల వాట్సాప్‌, 44.8 కోట్ల యూట్యూబ్‌, 41 కోట్ల ఫేస్‌బుక్‌, 21 కోట్ల ఇన్‌స్టాగ్రాం, 1.75 కోట్ల ట్విటర్‌ వినియోగదారులు ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని