కీలక నిర్ణయం: ఆ పరిశ్రమలకూ Oxygen బంద్‌! - govt decision liquid oxygen only for medical use
close
Published : 26/04/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీలక నిర్ణయం: ఆ పరిశ్రమలకూ Oxygen బంద్‌!

కేవలం వైద్య అవసరాలకే వినియోగించాలని ఆదేశం

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్‌ వినియోగానికి కొన్ని పరిశ్రమలకు ఇచ్చిన మినహాయింపును తొలగించింది. ఇకనుంచి అన్ని ఉత్పత్తి కేంద్రాల్లో తయారయ్యే ద్రవ ఆక్సిజన్‌ను కేవలం వైద్య అవసరాలకోసమే వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని, ఇప్పటికే అందుబాటులో ఉన్న నిల్వలతోపాటు ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను వైద్య అవసరాల కోసం ప్రభుత్వానికే సరఫరా అయ్యేట్లు చూడాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఆసుపత్రుల్లోని రోగులకు ప్రాణవాయువు కొరత లేకుండా చూడడం కోసం ఈ నెల 22 నుంచి పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్‌ సరఫరాను బంద్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొమ్మిది రకాల పరిశ్రమలకు మినహా మిగిలిన వాటికి ఆక్సిజన్‌ సరఫరా చేయకూడదని పేర్కొంది. అయినప్పటికీ పలు రాష్ట్రాల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యతను మరోసారి సమీక్షించిన కేంద్రం ఆ తొమ్మిది రకాల పరిశ్రమలకు కూడా ఆక్సిజన్ సరఫరా చేయకూడదని నిర్ణయించింది. అన్ని ఉత్పత్తి కేంద్రాల ద్రవ ఆక్సిజన్‌ను వైద్య అవసరాలకే వాడాలని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు జారీచేసేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఇక ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవడంతో పాటు విదేశాలనుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని