Cyclone Gulab effect: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నేడు సెలవు - govt offices schools education institutions closed today due to Cyclone Gulab effect
close
Updated : 28/09/2021 04:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cyclone Gulab effect: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నేడు సెలవు

శాసనసభ, మండలి 1వ తేదీకి వాయిదా

గులాబ్‌ తుపాను ప్రభావ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవుదినంగా సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక, పురపాలక, పంచాయతీరాజ్‌, నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖలను సెలవు నుంచి మినహాయించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉండాలని, భారీ వర్షాలతో ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. మరోవైపు తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలకు సైతం మూడు రోజుల పాటు వాయిదా వేశారు. వచ్చే నెల మొదటి తేదీ శుక్రవారం నాడు మళ్లీ ఉభయసభలు ఉదయం పది గంటలకు సమావేశమవుతాయని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డిలు తెలిపారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సమావేశాల ముగింపు సందర్భంగా ఉభయసభలు మంగళవారం సమావేశమవుతాయని పోచారం, భూపాల్‌రెడ్డిలు ప్రకటించారు. రాష్ట్రంలో వరదల ఉద్ధృతి దృష్ట్యా తమ నియోజకవర్గ ప్రజలను ఆదుకునేందుకు వీలుగా సమావేశాలను వాయిదా వేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోచారం, భూపాల్‌రెడ్డిలను కోరారు. దీనిపై వారు స్పందించి సీఎం కేసీఆర్‌, విపక్షాల నేతలను సంప్రదించారు. వారు కూడా ఆమోదం తెలపడంతో ఉభయ సభలను మూడు రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని