మరో 4.5 కోట్ల కొవిషీల్డ్‌ డోసులకు ఆర్డర్‌ - govt says committed to buying another 4.5 crore doses of covishield vaccine as distribution begins
close
Published : 12/01/2021 23:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో 4.5 కోట్ల కొవిషీల్డ్‌ డోసులకు ఆర్డర్‌

వెల్లడించిన కేంద్రం

దిల్లీ: సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మరో 4.5 కోట్ల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను కొనుగోలు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే 1.1 కోట్ల డోసులను ఆ సంస్థ నుంచి కేంద్రం కొనుగోలు చేసింది. ఒక్కో వ్యాక్సిన్‌ ధర రూ. 200 కాగా జీఎస్టీతో కలిపి ధర రూ. 210గా ఉంది. మంగళవారం ఉదయం పుణె నుంచి రాష్ట్రాలను కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పంపే ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్‌ కేంద్ర ఆరోగ్యశాఖ తరపున సరఫరా ఉత్తర్వులను జారీ చేసింది.

మొదటి ఆర్డర్‌ అయిన కొవిషీల్డ్‌ 1.1 కోట్ల డోసులకు రూ. 231 కోట్ల వ్యయం కాగా, రెండో ఆర్డర్‌కు సుమారు రూ.1,176 కోట్లు ఖర్చవుతాయని అంచనావేస్తున్నారు. ఈ రెండో ఆర్డర్‌కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ అడిషనల్‌ డైరక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌, ప్రభుత్వ ప్రతినిధి ఆర్‌ ఎస్‌ మంకు తెలిపారు. మరోవైపు కొవాగ్జిన్‌ టీకా 55లక్షల డోసులకు కూడా సోమవారం కేంద్రం ఆర్డర్‌ ఇచ్చింది. దీని ఖర్చు సుమారు రూ.162 కోట్లు. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మొదటి దశ ప్రాధాన్యతా క్రమంలో భాగంగా 3 కోట్ల మందికి టీకా వేయనున్నారు.

ఇవీ చదవండి..

తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న కొవిడ్‌ టీకా..

హెర్డ్‌ ఇమ్యునిటీ ఈ ఏడాది అసాధ్యమే..

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని