కొవిడ్‌ టెస్టుల సంఖ్యను పెంచండి - govt sends health teams to maharashtra punjab after spike in daily covid-19 cases and health sec guidelines to states
close
Published : 06/03/2021 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ టెస్టుల సంఖ్యను పెంచండి

రాష్ట్రాలను ఆదేశించిన కేంద్ర ఆరోగ్యశాఖ
మహారాష్ట్ర, పంజాబ్‌లకు ఆరోగ్య బృందాలు

దిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. గత కొన్ని వారాలుగా కేసులు పెరుగుతున్న ఎనిమిది రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి చేస్తున్న చర్యలను సమీక్షించారు. దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించామని వారు వెల్లడించారు. దిల్లీలో 9 , హరియాణాలో 15, ఆంధ్రప్రదేశ్‌లో 10, ఒడిశాలో 10, హిమాచల్‌ ప్రదేశ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 7, గోవాలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1 జిల్లాల్లో కరోనా టెస్టుల సంఖ్య తగ్గడంతో పాటు వీక్లీ పాజిటివిటీ రేటు పెరుగుతోందని వారు పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ కూడా సరిగా జరగట్లేదని గుర్తించినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్‌ వెల్లడించారు.

రాష్ట్రాలకు సూచనలు..

దేశంలో కరోనా పరిస్థితి కంగారు పుట్టిస్తున్న తరుణంలో కొవిడ్‌ మొదటి దశలో తీసుకున్న చర్యలను మళ్లీ తిరిగి అమలు చెయ్యాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులు చేసి పాజిటివ్‌ వచ్చిన వారిని ట్రేస్‌ చేయడంతో పాటు వారికి చికిత్స అందించాలన్నారు. వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేయాలని సూచించింది. ఎక్కువ మరణాలు నమోదవుతున్న జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ జరగాలన్నారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాలు, ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. దీని కోసం ప్రైవేటు ఆస్పత్రుల సహకారం తీసుకోవాలన్నారు. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఆ రెండు రాష్ట్రాలకు ఆరోగ్య బృందాలు..

గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలకు కేంద్రం శనివారం ఉన్నత స్థాయి ఆరోగ్య బృందాలను పంపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బృందాలు రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించడంతో పాటు, కట్టడి చర్యలపై పని చేస్తాయని వెల్లడించారు. శనివారం నాటికి మహారాష్ట్రలో 90,055 క్రియాశీల కేసులుండగా, పంజాబ్‌లో 6,661 కేసులతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని