‘గ్రామీ’ అవార్డుల వేడుకలు వాయిదా.. - grammy awards shifted to march from january due to pandemic concerns
close
Updated : 06/01/2021 15:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గ్రామీ’ అవార్డుల వేడుకలు వాయిదా..

లాస్‌ఏంజిల్స్‌: సంగీత ప్రపంచంలో ఆస్కార్‌ అవార్డుగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న నిర్వహించనున్నట్లు గ్రామీ ప్రతినిధులు ప్రకటించారు. తొలుత జనవరి 31న అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించాలని నిర్ణయించినా, కరోనా కారణంగా మార్చికి వాయిదా వేశారు. ‘‘ ఆరోగ్య నిపుణులు, కళాకారులతో చర్చించిన తర్వాత 63వ గ్రామీ పురస్కారాల వేడుకను మార్చి 14, ఆదివారం నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.’’ అని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. యూఎస్‌లో ఒక వైపు వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతుండగా మరోవైపు కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా లాస్‌ ఏంజిల్స్‌లో ఆస్పత్రులు, ఐసీయూలు కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. లాస్‌ఏంజిల్స్‌ ఎప్పటినుంచో హాలీవుడ్‌లో జరిగే గ్రామీస్‌, గోల్డెన్‌ గ్లోబ్స్‌, ఆస్కార్‌ వంటి ప్రముఖ అవార్డుల వేడులకు వేదికగా నిలుస్తోంది.

ఇవీ చదవండి..

సిడ్నీ టెస్టుకు జట్టును ప్రకటించిన భారత్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని