పార్టీల ప్రచారం.. పిడిగుద్దుల వర్షం - gujarat civic polls clash breaks out between bjp congress workers in vadodara
close
Updated : 21/02/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పార్టీల ప్రచారం.. పిడిగుద్దుల వర్షం

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా భాజపా, కాంగ్రెస్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం వడోదరాలోని తలావ్‌ ప్రాంతంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ర్యాలీ నిర్వహించాయి. ఈ సమయంలో ఎదురుపడ్డ భాజపా, కాంగ్రెస్‌ కార్యకర్తలు గొడవకు దిగారు. అసభ్య పదజాలంతో దూషించుకుంటూ రాళ్లు రువ్వుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. దీంతో రంగంలోని దిగిన ఇరు పార్టీల ముఖ్య నేతలు గొడవను అదుపులోకి తెచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని