close
Published : 19/04/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Gully Rowdy Teaser: నవ్వులే నవ్వులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్‌ కిషన్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. నేహా శెట్టి నాయిక. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. ‘బాబుని రంగంలోకి దింపు. బాబు రావాలి.. రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం అలరిస్తుంది. ఓ కిడ్నాప్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ నవ్వులు పూయిస్తున్నారు. ‘ఎవరైనా తమ మనవడ్ని ఇంజినీర్‌ చేస్తాడు.. డాక్టర్‌ చేస్తాడు.. ఎం.ఎల్‌.ఎ చేస్తాడు. ఈ రౌడీని చేయడమేంట్రా? నెపోటిజం’ అని ముగించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరి ఈ గల్లీ రౌడీ కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చౌరస్తా రామ్‌, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని