GullyRowdy: ప్రేమ పాట విన్నారా? - gullyrowdy song
close
Published : 07/05/2021 21:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

GullyRowdy: ప్రేమ పాట విన్నారా?

ఇంట‌ర్నెట్ డెస్క్‌: సందీప్ కిష‌న్ క‌థానాయ‌కుడిగా జి. నాగేశ్వ‌ర రెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రం గ‌ల్లీ రౌడీ. నేహా శెట్టి నాయిక‌. శుక్ర‌వారం సందీప్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాలోని ‘పుట్టెనే ప్రేమ‌... ప‌డ‌గొట్టెనే ప్రేమ’ అనే గీతాన్ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. భాస్క‌ర భ‌ట్ల సాహిత్యం అందించిన ఈ పాట‌ని స్వీయ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రామ్ మిర్యాల ఆల‌పించారు. క్యాచీ ప‌దాల‌తో కుర్రకారుని అమితంగా ఆకట్టుకునేలా ఉంది ఈ పాట‌. ముఖ్యంగా రామ్‌ స్వ‌రం ప్ర‌త్యేకంగా నిలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ పతాకంపై ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ, కోన వెంక‌ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాబీ సింహా, పోసాని, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కామెడీ ప్ర‌ధానంగా రూపొందుతున్న ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లై విశేషంగా ఆకట్టుకుంటోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని