HanuMan: ప్రశాంత్‌ వర్మ-తేజ చిత్రం షురూ - hanu man the first original superhero film in telugu launched directed by prasanth varma
close
Published : 25/06/2021 15:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HanuMan: ప్రశాంత్‌ వర్మ-తేజ చిత్రం షురూ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జాంబిరెడ్డి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా కనిపించిన తేజ సజ్జ ఈ సినిమాతోనే కథానాయకుడిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరి కలయికలో ‘హనుమాన్‌’ అనే మరో చిత్రం తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లో శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత సి. కల్యాణ్‌ క్లాప్‌ కొట్టగా.. జెమిని కిరణ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. శివ శక్తి దత్త ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ‘రెగ్యులర్‌ షూటింగ్‌ జులై నుంచి మొదలవుతుంది. ఇతర ప్రధాన తారాగణాన్ని త్వరలోనే ప్రకటిస్తాం’ అని చిత్ర బృందం తెలిపింది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ టీజర్‌ విశేషంగా ఆకట్టుకుని, సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఆ అంచనాలకి తగ్గట్టుగానే విజువల్‌ ఎఫెక్ట్స్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు దర్శకనిర్మాతలు.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని