కోహ్లీ లాగే.. అశ్విన్‌ను నేనూ అలా పిలుస్తా - harbhajan singh says he also calls ravichandran ashwin as legendary player like virat kohli
close
Published : 28/02/2021 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 కోహ్లీ లాగే.. అశ్విన్‌ను నేనూ అలా పిలుస్తా

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్టుల్లో 400 వికెట్లు సాధించిన టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఇకపై దిగ్గజమని పిలుస్తానని వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. మొతేరా స్టేడియంలో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా అశ్విన్‌.. ఈ ఘనత సాధించాడు. అలాగే స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్‌(72 మ్యాచ్‌ల్లో) తర్వాత తక్కువ టెస్టుల్లో ఆ మైలురాయి అందుకున్న బౌలర్‌గానూ‌(77 మ్యాచ్‌ల్లో) రికార్డులకెక్కాడు.

ఈ నేపథ్యంలో ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన హర్భజన్‌ టెస్టుల్లో 400 వికెట్లు తీయడం చాలా పెద్ద విషయమని చెప్పాడు. ‘టెస్టు మ్యాచ్‌లు ఆటగాళ్లను మానసికంగా, శారీరకంగా పరీక్షిస్తాయి. అలాంటి కఠిన పరిస్థితుల్లో ఇలాంటి ఘనత సాధించడంతో పాటు వరుసగా జట్టుకు విజయాలు అందించడం పెద్ద విశేషం. అశ్విన్‌ను దిగ్గజం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ అశ్విన్‌ 400 వికెట్లు తీయకపోయినా దిగ్గజమనే పేర్కొంటానని భజ్జీ స్పష్టం చేశాడు. విరాట్‌ అతడిని లెజెండ్‌ అని పిలుస్తాననడం గొప్ప విషయం. నేను కూడా అతడిని కలిసినప్పుడు లెజెండ్‌ అనే పిలుస్తా’ అని భజ్జీ వివరించాడు.

కాగా, పింక్‌బాల్‌ టెస్టు పూర్తయ్యాక టీమ్‌ఇండియా సారథి విరాట్‌.. ‘‘ఇప్పటి నుంచి అశ్విన్‌ను దిగ్గజమని పిలుస్తా. అతను ఈ తరం క్రికెట్‌ దిగ్గజం’’ అని సంబోధించిన సంగతి తెలిసిందే. మరోవైపు అశ్విన్‌ త్వరలోనే టెస్టుల్లో హర్భజన్‌ సింగ్‌(417), కపిల్‌ దేవ్‌(434) రికార్డులను అధిగమించే అవకాశం ఉంది. ప్రస్తుతం 401 వికెట్లతో కొనసాగుతున్న అతడు.. భజ్జీ కన్నా 16 వికెట్ల దూరంలో.. కపిల్‌ కన్నా 33 వికెట్ల వెనుకంజలో నిలిచాడు. త్వరలోనే మిగిలిన వికెట్లు కూడా సాధించి కుంబ్లే(619) తర్వాతి స్థానాన్ని అధిగమించే వీలుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని