Hardik Pandya: ఇక కష్టమే! - hardik might not be seen in test cricket says aakash chopra
close
Published : 10/05/2021 12:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hardik Pandya: ఇక కష్టమే!

సుదీర్ఘ ఫార్మాట్లో చోటు కష్టమేనన్న ఆకాశ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను ఇకపై టెస్టుల్లో చూడటం కష్టమేనని మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోనే అతడి అవసరం ఎక్కువగా ఉంటుందన్నాడు. మరి ఇంగ్లాండ్‌ టెస్టు సిరీసుకూ ఎంపిక చేయకపోవడం అంటే ఇకపై సుదీర్ఘ పార్మాట్లో అతడిని పరిగణనలోకి తీసుకోరనే అనిపిస్తోందని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.

గతంలో హార్దిక్‌ పాండ్యకు సెలక్టర్లు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. 2018లో ఇంగ్లాండ్‌లో అతడు చివరిసారిగా టెస్టు ఆడాడు. ఆ తర్వాత వెన్నుముక గాయాలతో ఇబ్బంది పడ్డాడు. లండన్‌లో శస్త్రచికిత్స సైతం చేయించుకున్నాడు. ఆ తర్వాతి ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. తిరిగి జట్టులోకి వచ్చినా బౌలింగ్‌ చేయడం లేదు. దాంతో సెలక్టర్లు ఇంగ్లాండ్‌కు ఎంపిక చేసిన 20 మంది సభ్యుల జట్టులో అతడికి చోటివ్వలేదు.

‘టెస్టు క్రికెట్లో హార్దిక్‌ పాండ్య అవసరం ఉన్నదే ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో. అక్కడ అతడి మీడియం పేస్‌ సేవలు అవసరమవుతాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో అతడికి చోటివ్వలేదంటే ఫర్వాలేదు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు సిరీస్‌ జట్టులోనూ అతడి పేరు లేదు. అంటే సమీక్ష భవిష్యత్తులో అతడిని సుదీర్ఘ ఫార్మాట్లో ఇక చూడలేం’ అని ఆకాశ్ అన్నాడు.

‘బౌలింగే ప్రధాన సమస్య. పాండ్య పనిభారాన్ని పర్యవేక్షిస్తున్నామని కొన్నాళ్ల క్రితం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం అన్నాడు. ఆ తర్వాత రోజు బౌలింగ్‌ చేయనని హార్దిక్ చెప్పాడు. అతడు సుదీర్ఘ ఫార్మాట్లో పరిగణనలో లేడనే ఆ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది’ అని ఆకాశ్ చెప్పాడు.

ఇంగ్లాండ్‌ సిరీస్‌కు భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, పృథ్వీషాను సైతం ఎంపిక చేయలేదు. ముగ్గురు పేసర్లు, నలుగురు స్పిన్నర్లు, నలుగురు స్టాండ్‌బై బౌలర్లను తీసుకున్న సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని