టీమ్‌ఇండియాకు షాక్‌: హర్మన్‌ప్రీత్‌కు కరోనా - harmanpreet kaur tested positive for covid 19
close
Updated : 30/03/2021 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్‌ఇండియాకు షాక్‌: హర్మన్‌ప్రీత్‌కు కరోనా

(Photo: Harmanpreet Kaur Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టీ20 మహిళా జట్టు సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు కరోనా సోకింది. ఆమెకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిసింది. గత నాలుగు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతుండటంతో సోమవారం కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారని.. దాంతో ఈ ఉదయం పాజిటివ్‌గా తేలిందని ఆమె సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ఆడిన హర్మన్‌ చివరి మ్యాచ్‌లో గాయపడింది. దీంతో టీ20 సిరీస్‌లో ఆడకుండా ఇంటికి చేరింది. వన్డే సిరీస్‌లో ఆడినన్ని రోజులు ఆమె నిరంతరం కరోనా పరీక్షలు చేసుకుందని, ఇంటికి వచ్చాకే వైరస్‌ బారిన పడిందని వారు పేర్కొన్నారు. మరోవైపు రోడ్‌సేఫ్టీ సిరీస్‌లో ఆడిన టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు.. సచిన్‌ తెందూల్కర్‌, యూసుఫ్‌ పఠాన్‌, బద్రీనాథ్‌తో పాటు తాజాగా ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం కరోనా బారిన పడ్డాడు. దీంతో ఆ సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లంతా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని