హస్మతుల్లా రికార్డు డబుల్‌    - hasmatullah shaheed record double century against zimbawbwe
close
Updated : 12/03/2021 10:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హస్మతుల్లా రికార్డు డబుల్‌  

జింబాబ్వేతో అఫ్గాన్‌ రెండో టెస్టు 

అబుదాబి: హస్మతుల్లా షహీదీ (200 నాటౌట్‌; 443 బంతుల్లో 21×4, 1×6) రికార్డు డబుల్‌ సెంచరీ సాధించడంతో జింబాబ్వేతో రెండో టెస్టులో అఫ్గానిస్థాన్‌ భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ను 545/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 307/3తో రెండోరోజు, శనివారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన అఫ్గాన్‌ను హస్మతుల్లా నడిపించాడు. 276 బంతుల్లో సెంచరీ సాధించిన అతడు..మరో 167 బంతుల్లో ద్విశతకాన్ని అందుకున్నాడు. టెస్టుల్లో డబుల్‌ సెంచరీ చేసిన తొలి అఫ్గాన్‌ బ్యాట్స్‌మన్‌గా హస్మతుల్లా రికార్డు సృష్టించాడు. మరో సెంచరీ వీరుడు అస్గర్‌ (164)తో కలిసి అతడు నాలుగో వికెట్‌కు 307 పరుగులు జత చేశాడు. అస్గర్‌ వెనుదిరిగినా.. జమాల్‌ (55) తోడుగా హస్మతుల్లా భారీస్కోరు అందించాడు. టెస్టుల్లో అఫ్గాన్‌కు ఒక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక స్కోరు. బదులుగా జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ కోల్పోకుండా 50 పరుగులు చేసింది. ప్రిన్స్‌ (29), కసూజా (14) క్రీజులో ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని