వ్యాక్సిన్‌ తీసుకున్నా.. జాగ్రత్తగానే ఉండాలి - having vaccine does not mean we should be complacent: vardhan
close
Published : 08/02/2021 20:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ తీసుకున్నా.. జాగ్రత్తగానే ఉండాలి

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌

దిల్లీ: వ్యాక్సిన్‌ తీసుకున్నామన్న విశ్వాసంతో కరోనా నిబంధనల్ని నిర్లక్ష్యం చేయకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్హవర్ధన్‌ హెచ్చరించారు. భారత రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్న ఆయన సోమవారం పలు ప్రాంతాల్లో మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా సమయంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ చర్యలను ఆయన అభినందించారు. ఇప్పటికే దిల్లీలోని జనసమ్మర్థ ప్రాంతాల్లో మాస్కులను పంపిణీ చేశామని ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి నిబంధనల్ని కచ్చితంగా పాటించాలన్నారు.

అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం దేశంలో జరుగుతోందని హర్షవర్ధన్‌ వెల్లడించారు. భారత్‌లో రికవరీ రేటు 97.20 గా ఉందన్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1.48లక్షలుగా ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా టెస్టుల్లో ఇప్పటికే 2కోట్ల మార్కును దాటిన భారత్ ఇంకా ఎక్కువ టెస్టులు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. మాస్కులు, పీపీఈ కిట్లు దిగుమతి చేసుకొనే పరిస్థితి నుంచి వాటిని సొంతంగా తయారు చేసుకొని ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ చేరిందన్నారు. కాగా ఇప్పటి వరకూ 58 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్లు అందించినట్లు తెలిపారు. వ్యాక్సిన్‌పై వచ్చే వదంతులను ప్రజలు నమ్మొద్దని కోరారు.

ఇవీ చదవండి..

ఒక్క ఫోన్‌కాల్‌.. 12 ప్రాణాలు

టీకా ఉత్పత్తిలో భారత్‌ది వ్యూహాత్మక పాత్రమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని