అజిత్‌ ఓ సాధారణ వ్యక్తిలానే ఉంటారు: కార్తికేయ - he is the simplest person i have ever met says karthikeya
close
Published : 20/03/2021 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అజిత్‌ ఓ సాధారణ వ్యక్తిలానే ఉంటారు: కార్తికేయ

హైదరాబాద్‌: స్టార్‌ హీరో అయినప్పటికీ అజిత్‌ ఓ సాధారణమైన వ్యక్తిలానే ఉంటారని యువ కథానాయకుడు కార్తికేయ అన్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ కథానాయకుడిగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అజిత్‌ హీరోగా నటిస్తున్న ‘వలిమై’తో కార్తికేయ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గురించి కార్తికేయ తాజాగా స్పందించారు. అజిత్‌తో స్క్రీన్‌ పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, అలాంటి సింపుల్‌ పర్సన్‌ని తాను ఇప్పటివరకూ కలవలేదని తెలిపారు. ‘వలిమై’ కారణంగా అజిత్‌తో కలిసి పనిచేయడం వల్ల తాను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని అన్నారు.

అనంతరం ఆ సినిమా చిత్రీకరణ గురించి మాట్లాడుతూ.. స్పెయిన్‌లో ఓ రేసింగ్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించాల్సి ఉందని, దాదాపు మూడు రోజులపాటు అక్కడ షూట్‌ జరగవచ్చని తెలిపారు. అంతేకాకుండా షూట్‌కు అనుమతి కోరుతూ ఇప్పటికే చిత్రబృందం స్పెయిన్‌ ప్రభుత్వానికి లేఖ రాసిందని కార్తికేయ వివరించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నారు. మరోవైపు ఇటీవల అజిత్‌ ఓ ఆటోలో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టింది. అది చూసిన నెటిజన్లు.. అజిత్‌ సింప్లిసిటీని మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని