Mansukh Mandaviya: మీరు రికార్డు సృష్టించారు.. లడ్డూలు తీసుకోండి! - health ministers vaccine landmark celebration at delhi hospital
close
Published : 18/09/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mansukh Mandaviya: మీరు రికార్డు సృష్టించారు.. లడ్డూలు తీసుకోండి!

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజులో 2 కోట్లకు పైగా కొవిడ్‌ డోసులను పంపిణీ చేసినందుకు ఆరోగ్య కార్యకర్తలతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలోని డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి లడ్డూలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ‘ప్రధాని మోదీకి దేశప్రజల తరఫున ఆరోగ్య కార్యకర్తలు బహుమతి అందజేశారు. ఆయన పుట్టిన రోజు పురస్కరించుకొని 2 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించడంతో సరికొత్త రికార్డు సృష్టించారు’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

శుక్రవారం ఒక్కరోజే 2.5 కోట్ల డోసులు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఇప్పటివరకు నెల వ్యవధిలోనే కోటి మార్కును నాలుగు సార్లు అధిగమించినట్లయింది. కరోనా థర్డ్‌ వేవ్‌ రాకుండా ఉండాలంటే ఈ ఏడాది చివరి వరకు దేశ జనాభాలో 60 శాతం వ్యాక్సినేషన్‌ జరగాలని నిపుణులు చెబుతున్నారు. ఇంత జనాభాకు వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలంటే రోజుకు 1.2 కోట్ల డోసులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబరు వరకు 39 శాతం జనాభాకు మాత్రమే పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తవుతుంది. అయితే, మరింత వేగంగా వ్యాక్సినేషన్‌ జరిపి లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని