
తాజా వార్తలు
ఆ వార్తల గురించి నా పేరెంట్స్‌కి తెలుసు..!
అనన్యపాండే
ముంబయి: తాను ప్రేమలో ఉన్నానంటూ వస్తోన్న వార్తల గురించి తన తల్లిదండ్రులకు ముందే తెలుసని బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యపాండే అన్నారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అనన్య తన పర్సనల్ లైఫ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. పుస్తకాలు చదవడం, ఇంగ్లిష్, హిందీ క్లాసిక్ చిత్రాలను చూడడం.. ఇలా క్వారంటైన్ లైఫ్ కూల్‌గా సాగిపోతోందని చెప్పారు.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమయ్యాను. అది మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత నటించిన ‘పతీ పత్నీ ఔర్ హో ’ సినిమా కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. అలా వెంట వెంటనే తొలి రెండు సినిమాలతో హిట్ అందుకున్నాను. హ్యాట్రిక్ గురించి ఎలాంటి ఒత్తిడి లేదు. నటిగా మంచి గుర్తింపు పొందేందుకు ఎంతో శ్రమిస్తున్నాను. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాను. నటిగా రాణించేందుకు ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాను.
ఇషాన్ ఖట్టర్ కథానాయకుడిగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాను. కేవలం ఒక్కరోజు షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమాని జూన్ నెలలో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కాకపోతే పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. విడుదల తేదీలో మార్పులుంటాయి. దీనితోపాటు షాకున్ బత్రా చిత్రంలో నటించాల్సి ఉంది. ఆయన చెప్పిన కథ బాగా నచ్చింది షూటింగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ చిత్రంతో తెలుగువారిని పలకరించేందుకు సిద్ధమయ్యాను. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా కనిపించనున్నారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముంబయిలో జరిగిన షెడ్యూల్లో మా ఇద్దరిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక నేను ప్రేమలో ఉన్నానంటూ ఎన్నో సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు. నేను చెప్పడానికంటే ముందే అమ్మవాళ్లకి ఆ రూమర్స్ గురించి తెలుసు. నా పేరెంట్స్‌తో ఎంతో క్లోజ్‌గా ఉంటాను. నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని వాళ్లతో పంచుకుంటాను. వాళ్లు నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారు.’ అని అనన్య పేర్కొన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
- భలే పంత్ రోజు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
