Kathi Mahesh: తాజా ఆరోగ్య పరిస్థితి ఏంటి? - here actor kathi mahesh latest health update
close
Published : 27/06/2021 19:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kathi Mahesh: తాజా ఆరోగ్య పరిస్థితి ఏంటి?

చెన్నై: సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కత్తి మహేశ్‌ గాయాలను మరోసారి పరీక్షించారు. తలకు బలమైన గాయాలైనట్లు గుర్తించారు. ముక్కులో ఒక ఫ్యాక్చర్‌, కంటిలోపల మరో గాయమైందని వైద్యులు తెలిపారు. తలకు తగిలిన గాయాలకు సోమవారం శస్త్రచికిత్స చేయనున్నారని, కంటికి కూడా ఆపరేషన్‌ చేస్తారని సన్నిహితులు తెలిపారు. కంటి చూపునకు ఎలాంటి సమస్య ఉండదని, వైద్యులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వివరించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. వైద్యులు ఆపరేషన్‌ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని