#AA21: ఆ ఊరిని చూస్తున్న ఇద్దరెవరు? - here is AA21 concept poster
close
Updated : 31/07/2020 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#AA21: ఆ ఊరిని చూస్తున్న ఇద్దరెవరు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకి రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌/ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నది ఒడ్డున దూరంగా ఓ ఊరును చూస్తున్న ఇద్దరు వ్యక్తులతో ఈ పోస్టర్‌ రూపొందించారు. అదే ఫ్రేమ్‌లో గద్దలు తిరుగుతున్న ఆకాశం, ఓ పక్క తెప్ప, కింద పడిపోయిన లాంతరు ఉన్నాయి. పోస్టర్‌ను గ్రే, రెడ్‌ కలర్‌ కాంబినేషన్‌లో రూపొందించారు. చిత్రబృందం ఇందులో కథ, ఆలోచనను చెప్పే ప్రయత్నం చేసింది. ఇక ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్‌, యువసుధ ఆర్ట్స్‌ కలసి నిర్మిస్తున్నాయి. కొరటాల శివ స్నేహితుడు సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాత కాగా, అల్లు అర్జున్‌ స్నేహితులు శాండీ, స్వాతి, నట్టి సహ నిర్మాతలు. 2022 ప్రథమార్ధంలో సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం పోస్టర్‌లో తెలిపింది. ఈ సినిమాను తెలుగుతోపాటు మరికొన్ని భాషల్లో విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. 

లాక్‌డౌన్‌ సమయంలో కొరటాల శివ అల్లు అర్జున్‌ కోసం కథ సిద్ధం చేశారట. ఇందులో అల్లు అర్జున్‌ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తారట. యువతను రాజకీయాల్లోకి రమ్మని చెప్పే యువకుడిగా బన్ని కనిపిస్తాడట. మెరుగైన సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని తెలియజేసేలా కథ ఉండబోతోందట. ఈ సినిమా కోసం యువ రాజకీయాలపై కొరటాల అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విద్యార్థి రాజకీయాల మీద కొన్ని సినిమాలు వచ్చాయి. అన్నీ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు - కొరటాల పిలుపు ఎలా ఉంటుందో చూడాలి. కొరటాల ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా ‘ఆచార్య’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్‌ త్వరలోనే ‘పుష్ప’ కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ రెండింటి తర్వాతే అల్లు అర్జున్‌ - కొరటాల కలయికలో సినిమా చిత్రీకరణ మొదలవుతుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని