నాకు వచ్చిన నోటీస్‌ వేరు: తనీష్‌ - hero tanish explanation on police notice
close
Published : 13/03/2021 18:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాకు వచ్చిన నోటీస్‌ వేరు: తనీష్‌

హైదరాబాద్‌: మాదక ద్రవ్యాల కేసు విచారిస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉపవిభాగం పోలీసులు తెలుగు సినీ నటుడు తనీష్‌తోపాటు మరో ఐదుగురిని శనివారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనీష్‌ గురించి పలు ఛానెళ్లలో కథనాలు ప్రసారం కావడంపై ఆయన ఓ వీడియో సందేశం ద్వారా ఖండించారు. నిజానిజాలేమిటో తెలుసుకునేందుకు కనీసం సంప్రదించలేదని అన్నారు. ఆ వార్తలన్నీ తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని వాపోయారు.

బెంగళూరుకు చెందిన నిర్మాతకు డ్రగ్స్‌ కేసులో నోటీసులు వచ్చిన మాట నిజమని, అయితే, తనకు వచ్చిన నోటీసు అర్థమేమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. రెండేళ్లుగా ఆ నిర్మాతతో తనకు సంబంధాలు లేవని తెలిపారు. ఈ కేసులో తనకు వ‌చ్చిన నోటీసుకు కార‌ణం వేరని, ‘ఫలానా వ్యక్తి గురించి మీకు వివరాలు తెలిస్తే చెప్పండి’ అని మాత్రమే అడిగేందుకు నోటీస్‌ ఇచ్చారని తనీష్ వివరించారు. ద‌య‌చేసి ఇలాంటి అస‌త్య ప్రచారం చేయొద్దని మీడియాకు విన్నవించారు. బెంగ‌ళూరుకు చెందిన ఆ నిర్మాత తనతో సినిమా చేస్తానని సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు. ప్రస్తుతం ఆయనతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని