Cinema News: మహేశ్‌ చేతుల మీదుగా ‘హీరో’ - hero title teaser out now
close
Published : 23/06/2021 14:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: మహేశ్‌ చేతుల మీదుగా ‘హీరో’

హైదరాబాద్‌: గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్‌ కుమారుడు అశోక్‌ కథానాయకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అశోక్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను బుధవారం సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు విడుదల చేశారు. ఇందులో అశోక్‌.. కౌబాయ్‌, జోకర్‌ గెటప్పుల్లో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

విభిన్నమైన లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో అశోక్‌కు జంటగా నిధి అగర్వాల్‌ సందడి చేయనున్నారు. అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, వెన్నెల కిషోర్‌, నరేష్‌, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషిస్తున్నారు. చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని