
తాజా వార్తలు
గుండెపోటుతో టాలీవుడ్ హీరో మృతి
హైదరాబాద్: టాలీవుడ్లో ఒకప్పటి హీరో యాదా కృష్ణ(61) కన్నుమూశారు. బుధవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. నటనతో పాటు ఆయన పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. 2010లో వచ్చిన ‘సంక్రాంతి అల్లుడు’ ఆయనకు చివరి సినిమా. వీవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి సునాక్షీ, రోషిని, ఏవీఎస్, జీవా, కొండ వలస కీలక పాత్రల్లో నటించారు. యాదా కృష్ణ 20కి పైగా తెలుగు సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ‘గుప్త శాస్త్రం‘, ‘వయసు కోరిక’, ‘పిక్నిక్’ వంటి సినిమాల్లో ఆయన నటించారు. యాదా కృష్ణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- భారత్ చిరస్మరణీయ విజయం..
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
