ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేను: కేజీఎఫ్‌ హీరో - hero yash completed twelve years in cine industry
close
Published : 19/07/2020 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేను: కేజీఎఫ్‌ హీరో

సినీ పరిశ్రమలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న యశ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన దగ్గర హీరో యశ్‌ అంటే పెద్దగా ఎవరూ గుర్తుపట్టరు. కానీ కేజీఎఫ్‌ రాఖీభాయ్‌ అని చెబితే చటుక్కున గుర్తొచ్చే రూపం అతడిది. ఆ పాత్రకు తను తప్ప మరెవరూ న్యాయం చేయలేరన్న రీతిలో నటించారు. కన్నడలో స్టార్‌ హీరోగా వెలుగొందుతున్న యశ్‌.. కేజీఎఫ్‌ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్నారు. ఒక్క సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిన యశ్‌.. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తయింది.

యశ్ అసలు పేరు నవీన్‌ కుమార్‌ గౌడ. తను నటించిన తొలి చిత్రం ‘మొగ్గిన మనసు’. అది 2008 జులై 18న విడుదలైంది. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రాధికా పండిట్‌ నటించారు. విశేషమేమిటంటే, రాధికా పండిట్‌.. యశ్‌ సతీమణి. ఈ చిత్రంతోనే వీరిద్దరు వెండితెరకు పరిచమయ్యారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో యశ్‌.. రాధికా ప్రేమించుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ‘మొగ్గిన మనసు’కి శశాంక్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హీరోగా యశ్‌కు అవకాశాలు వరుస కట్టాయి. దీంతో కల్లారా సంతే, మొదలసాల, రాజధాని, కిరాతక, గూగ్లీ, రాజహులి వంటి సినిమాల్లో నటించారు. 2014లో వచ్చిన మిస్టర్‌ అండ్‌ మిసెస్‌  రామాచారి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. దీనిలోనూ రాధికా పండిట్‌ హీరోయిన్‌. ఆ తర్వాత కేజీఎఫ్‌ చాప్టర్‌-1తో యశ్‌ ఆల్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. ప్రస్తుతం కేజీఎఫ్‌ చాప్టర్‌-2లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. 

సినీ హీరోగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యశ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేకమైన రోజును ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఏమీ లేని స్థాయి నుంచి తారస్థాయికి వచ్చానని చెప్పారు. కేజీఎఫ్‌ చాప్టర్‌-2 గురించి ప్రస్తావిస్తూ.. ఈ సినిమా షూటింగ్‌ కొంత మిగిలిపోయిందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని యశ్‌ చెప్పారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని