Interview: అల్లు అర్జున్‌ అంటే క్రష్‌.. టాక్సీవాలా తర్వాత 25 కథలు విన్నాను: ప్రియాంక జావల్కర్‌ - heroine priyanka jawalkar interview
close
Published : 11/08/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Interview: అల్లు అర్జున్‌ అంటే క్రష్‌.. టాక్సీవాలా తర్వాత 25 కథలు విన్నాను: ప్రియాంక జావల్కర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘టాక్సీవాలా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనంతపురం అమ్మాయి ప్రియాంక జావల్కర్‌. తొలి సినిమాతోనే హిట్‌ అందుకున్న ఆమె కాస్త విరామం తర్వాత ఒకేసారి రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్యదేవ్‌తో కలిసి ‘తిమ్మరుసు’, కిరణ్‌ అబ్బవరంతో కలిసి ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణ మండపం’లో నటించింది. ప్రస్తుతం ఆ రెండు సినిమాలు థియేటర్లలో అలరిస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండటంతో ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చిందామె.. అవేంటో ఆమె మాటల్లోనే..

‘తిమ్మరుసు’కు మొదటిరోజే మంచి స్పందన వచ్చింది. ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’ విడుదల రోజు మిశ్రమ ఫలితాలు కనిపించాయి. ఆ తర్వాత మంచి ఆదరణ వస్తోంది. థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ బాగానే ఉంటోంది. కలక్షన్స్‌ కూడా వస్తున్నాయి. సంతోషంగా ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత దాదాపు ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయడం గురించి మాట్లాడే ముందు నాకు వచ్చిన గ్యాప్‌ గురించి కూడా ప్రస్తావించాలి. 2019లో ఒక సినిమా చేశాను. 2020లో ‘తిమ్మరుసు’తో పాటు ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణ మండపం’ చేశాను. గతేడాది ఆగస్టులోనే ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండంపం’ విడుదల కావాల్సి ఉంది. కానీ.. కరోనా వల్ల ఆలసమ్యమైంది. ఒకే నెలలో రెండు సినిమాలు విడుదల కావడంతో కొంచెం టెన్షన్‌ పడ్డాను. అసలు ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారా..? అంత ధైర్యం చేస్తారా.? అనే అనుమానం ఉండేది. వారం రోజుల పాటు సరిగా నిద్రపట్టలేదు. కానీ.. నా భయం నిజం కాలేదు. రెండు సినిమాలనూ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.

ప్రతివారం ఎవరో ఒకరు కథ వినిపిస్తూనే ఉన్నారు. అయితే.. మనం చేసే సినిమా మంచి ఫలితాలు రాబట్టే విధంగా ఉండాలి. అప్పుడే నిర్మాతలు వాళ్లు పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోగలరు. అలా ఆలోచించే నేను చేసే ప్రతి సినిమాను ఎంచుకుంటున్నాను.

‘తిమ్మరుసు’ సినిమాలో బొద్దుగా ఉన్నానంటూ చాలామంది కామెంట్లు చేశారు. శరీరాకృతి, కెరీర్‌ గురించి జాగ్రత్తలు తీసుకోవడం లేదా అంటూ ప్రశ్నించారు. నా కెరీర్‌ గురించి నాకంటే ఎక్కువ జాగ్రత్తలు ఎవరూ తీసుకోలేరు. నేనే కాదు ప్రతి ఒక్క మనిషి తన ఆరోగ్యం, భవిష్యత్తు గురించి తానే జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. నాలో మార్పులు వచ్చాయి. వాటితో నాకు కూడా ఇబ్బందిగా అనిపించింది. డాక్టర్లను సంప్రదిస్తే.. థైరాయిడ్‌ అని చెప్పారు. ఆ కారణంగానే బరువు పెరిగాను. ఆ తర్వాత జిమ్‌లో వర్కౌట్‌లు చేసి మళ్లీ బరువు తగ్గాను. అయితే.. నా కెరీర్‌ విషయంలో అజాగ్రత్తగా లేనని చెప్పేందుకే ఆ రోజు వేదిక మీద ‘‘నేను మోడల్‌ను కాదు.. నటిని’’ అని మాట్లాడాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే.. నిజ జీవితంలో ఉన్నదాని కంటే మన శరీరం కెమెరాలో 30శాతం భారీగా కనిపిస్తుంది. ఉన్నదున్నట్టుగా కనిపించాలంటే మనం సన్నగా ఉండాలి.

‘టాక్సీవాలా’ తర్వాత మంచి స్క్రిప్టు దొరక్కనే ఎక్కువ గ్యాప్‌ వచ్చింది. దాదాపు 25 కథలు విన్నాను. తమిళం, కన్నడ కథలు కూడా విన్నాను. వచ్చే నెలలో ఇంకో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నింట్లో ‘గమనం’ కథ నాకు బాగా నచ్చింది. ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’, ‘తిమ్మరుసు’లో పాత్రలు కూడా ఛాలెంజింగ్‌గా ఉండటంతో ఓకే చెప్పాను. ‘గమనం’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. అందుకే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనలేకపోయాను. సోషల్‌మీడియాలో నాకు వీలైనంత వరకూ చేయగలిగాను. 

‘తిమ్మరుసు’లో ఇంకా కొంచెం కష్టపడి చేయాల్సిందేమోనని అనిపించింది. ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’లో బాగానే చేశాను. నా స్నేహితులు కూడా నాకు అదే చెప్పారు. నాకు డైరెక్టర్‌ ఎలా చెప్తే అలా చేస్తాను. అంతేకానీ.. విజయ్‌ దేవరకొండ, సత్యదేవ్‌లాగా మానిటర్‌లో చూసి జడ్జిమెంట్‌ ఇవ్వలేను. నాకు గైడెన్స్‌ లేకుండా నేను ఏదీ చేయలేను. ఇప్పుడు కథలు వింటున్నాను. తమిళంలో ఒక సినిమాకు సంతకం చేశాను. ప్రొడక్షన్‌ హౌజ్‌ ఖరారు అయ్యాక ఆ సినిమా వివరాలు మీతో పంచుకుంటా. ‘టాక్సీవాలా’, ‘తిమ్మరుసు’, ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’ మూడు మంచి విజయాలు అని చాలామంది అంటున్నారు. హ్యాట్రిక్‌ హిట్స్‌ అంటే నేనే నమ్మలేకపోతున్నా. ఒకే వారంలో రెండు సినిమాలు విడుదల కావడం.. రెండూ మంచి ఆదరణ సొంతం చేసుకోవడం ఏ హీరోయిన్‌ విషయంలోనూ నేను చూడలేదు. సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు.

యూట్యూబ్‌ థంబ్‌నైల్‌లో నా గురించి వచ్చే వార్తలను చూసి నవ్వుకుంటా. మంచి గాసిప్స్‌ అయితే.. ఎంజాయ్‌ చేస్తూ.. నేనే నా స్నేహితులకు పంపిస్తూ ఉంటా అని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. 

 అల్లు అర్జున్‌ అంటే క్రష్ అని చెప్పిన ఈ అమ్మడు.. మలయాళం చిత్రం ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ అంటే బాగా ఇష్టమట. బాలీవుడ్‌లో వెబ్‌సిరీస్‌ల కోసం ఆడిషన్స్‌ ఇస్తున్నట్లు చెప్పింది. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని