Tollywood heroins: అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం - heroins special story
close
Updated : 03/06/2021 11:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood heroins: అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం

ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టు ఇప్ప‌టి క‌థానాయిక‌లు త‌మ‌ని తాము మార్చుకుంటున్నారు. పూర్తిగా గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ప‌రిమితం కాకుండా అవ‌కాశం వ‌చ్చినప్పుడు స‌వాలు విసిరే పాత్ర‌లు పోషించేందుకూ సై అంటున్నారు. ఓ సినిమాలో అందంగా కనిపించి.. మ‌రో చిత్రంలో అభిన‌యం ప్ర‌ద‌ర్శించి.. మేము అదీ చేస్తాం, ఇదీ చేస్తాం అని నిరూపించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.. ఈ జాబితాలో నిలిచిన భామ‌లెవ‌రు, ఏ సినిమాల‌తో రాబోతున్నారో చూద్దాం...

‘మ‌హాన‌టి’ చిత్రంతో జాతీయ స్థాయిలో మెరిసింది కీర్తి సురేశ్‌. అల‌నాటి న‌టి సావిత్రిగా ఒదిగిపోయి విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు అందుకుంది. దాంతో నాయికా ప్రాధాన్య క‌థ‌ల‌కు చిరునామాగా మారింది. ఈ క్ర‌మంలో ‘మిస్ ఇండియా’ చేసినా అది ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌లేదు. త్వ‌ర‌లోనే అభిన‌యానికి ప్రాధాన్య‌మున్న మ‌రో చిత్రం ‘గుడ్‌ లక్‌ స‌ఖి’తో రానుంది.  దర్శ‌కుడు న‌గేశ్ కుకునూర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాలో స‌ఖి అనే పాత్ర‌లో ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌నుంది కీర్తి. మ‌రోవైపు ‘స‌ర్కారు వారి పాట’ చిత్రంలో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న గ్లామ‌ర్ రోల్ పోషిస్తోంది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోంది ఈ సినిమా. వీటితోపాటు ‘మ‌ర‌క్క‌ర్‌’, ‘వాశీ’ (మ‌ల‌యాళం), ‘అణ్ణాత్తే’ (త‌మిళ‌) సినిమాల్లోనూ క‌నువిందు చేయ‌నుంది.

తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన క‌న్న‌డ న‌టి ర‌ష్మిక‌. ‘ఛ‌లో’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైంది. ‘పుష్ప’లో సరికొత్త పాత్రలో దర్శనమివ్వనుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌లో పల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌నుంది ర‌ష్మిక‌. బ‌న్నితో ఇలా న‌టిస్తుంటే.. ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ శ‌ర్వానంద్ స‌ర‌స‌న గ్లామ‌ర్ పాత్ర పోషిస్తోంది. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. వీటితోపాటు ‘మిష‌న్ మ‌జ్ను’, ‘గుడ్ బై’అనే హిందీ చిత్రాల్లోనూ న‌టిస్తోంది.

ఖిల్ స‌ర‌స‌న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’, ప్ర‌భాస్ స‌ర‌స‌న ‘రాధే శ్యామ్’ చిత్రాల్లో ప్రేమికురాలిగా క‌నిపించ‌నుంది పూజా హెగ్డే. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కొర‌టాల శివ తెర‌కెక్కిస్తోన్న ‘ఆచార్య’ చిత్రంలో నీలాంబ‌రి అనే అభిన‌యానికి ప్రాధాన్య‌మున్న పాత్ర పోషిస్తోంది. ఈ తెలుగు సినిమాలతోపాటు హిందీలో ‘స‌ర్క‌స్’, త‌మిళంలో ‘త‌ల‌పతి 65’ సినిమాల్లోనూ న‌టిస్తోంది.

హిందీ చిత్రాలు ‘ఎటాక్‌’, ‘మేడే’, ‘థ్యాంక్ గాడ్’ లో ట్రెండీ పాత్ర‌ల్లో న‌టిస్తోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తోన్న చిత్రంలో అభిన‌యానికి పెద్ద పీట వేసింది. టైటిల్ ఖ‌రారు ఈ చిత్రంలో డీ గ్లామ‌ర్‌గా క‌నిపించ‌నుందని సమాచారం.

వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి  తెర‌కెక్కిస్తోన్న ‘ఎఫ్ 3’, స‌త్యదేవ్‌ క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న  ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాల్లో గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తోంది త‌మ‌న్నా. గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది తెర‌కెక్కిస్తోన్న ‘సీటీమార్‌’, నితిన్ హీరోగా మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కిస్తోన్న ‘మ్యాస్ట్రో’ చిత్రాల్లో అభిన‌యం ప్ర‌దర్శిస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని