ఇదే చివరి అవకాశం: హైకోర్టు - highcourt orderd govt to give full on corona
close
Updated : 20/07/2020 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇదే చివరి అవకాశం: హైకోర్టు

కరోనా బులిటెన్‌లో సమగ్ర వివరాలు ఉండాలన్న న్యాయస్థానం

హైదరాబాద్‌: కరోనా బులిటెన్‌ విడుదల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. కోర్టు సహనాన్ని పరీక్షించవద్దని చెప్పింది. ఈ నెల 28న సీఎస్‌, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. బులిటెన్‌లో సమగ్ర వివరాలు ఉండేలా చూడాలని సూచించింది. కలెక్టర్లు జిల్లాల వారీగా కరోనా కేసులు, ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలు, రాపిడ్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారనే విషయాలను వెల్లడించాలని సూచించింది. వైద్యారోగ్యశాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నంబరును విస్తృత ప్రచారం చేయాలి. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు మరిన్ని ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలి. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు కాకుండా చూడాలి. కరోనా నియంత్రణ ప్రభుత్వం, అధికారుల రాజ్యాంగ బద్ధమైన విధి. దానిని విస్మరించరాదు’’ అని కోర్టు తెలిపింది. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని