ఆసీస్‌పై కోహ్లీకి లేని రికార్డు పంత్‌ సొంతం - highest average by a visiting batsmen in australia
close
Published : 11/01/2021 21:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసీస్‌పై కోహ్లీకి లేని రికార్డు పంత్‌ సొంతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పరుగుల రారాజు విరాట్‌ కోహ్లీ, నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా, టెస్టు స్పెషలిస్టులు అజింక్య రహానె, మురళీ విజయ్‌కు సైతం లేని ఘనత సాధించాడు. గత పదేళ్లలో ఆసీస్‌లో కనీసం 500+ పరుగులు చేసినవారిలో అత్యధిక సగటు నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌ 118 బంతుల్లో 97 పరుగులు చేశాడు. 12 బౌండరీలు, 3 సిక్సర్లు బాదేశాడు. నేథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో భారీ బౌండరీలు సిక్సర్లు దంచికొట్టాడు. అలాగే పేసర్లనూ ఉతికారేశాడు. పుజారా (77)తో కలిసి నాలుగో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. టీమ్‌ఇండియా ఓటమి పాలవ్వకుండా రక్షించాడు. బ్యాట్స్‌మెన్‌లో స్ఫూర్తి నింపాడు. దాంతో భారత్‌ సిడ్నీ టెస్టును డ్రాగా ముగిచింది. సిరీస్‌ను 1-1తో సజీవంగా ఉంచుకుంది.

కంగారూ గడ్డపై గత పదేళ్లలో రిషభ్ పంత్‌ 6 మ్యాచులు ఆడగా 56.88 సగటుతో 512 పరుగులు చేశాడు. ఆసీస్‌పై అతనెప్పుడూ 25కు తక్కువ పరుగులు చేయనేలేదు. 2019లో ఇదే సిడ్నీ వేదికపై పంత్‌ సింహగర్జన చేశాడు. కేవలం 189 బంతుల్లో 159 పరుగులతో అజేయంగా నిలిచాడు. మళ్లీ అదే సిడ్నీలో ప్రస్తుతం 118 బంతుల్లో 97 చేయడం గమనార్హం. ఇక విరాట్‌ కోహ్లీ ఆసీస్‌లో 13 మ్యాచుల్లో 54.08 సగటుతో 1352 పరుగులు చేయడం ప్రత్యేకం. చెతేశ్వర్‌ పుజారా 10 మ్యాచుల్లో 48 సగటుతో 912, మురళీ విజయ్‌ 6 మ్యాచుల్లో 44.25 సగటుతో 531, అజింక్య రహానె 11 మ్యాచుల్లో 43.41 సగటుతో 823 పరుగులు సాధించారు. సగటు విషయంలో ఆసీస్‌పై టీమ్‌ఇండియా ఆటగాళ్లదే హవా. ఆ తర్వాత కేన్‌ విలియమ్సన్‌ 7 మ్యాచుల్లో 42.84 సగటుతో 557, అలిస్టర్‌ కుక్‌ 11 మ్యాచుల్లో 42.68 సగటుతో 811, రాస్‌ టేలర్‌ 8 మ్యాచుల్లో 42.20 సగటుతో 633, జో రూట్‌ 9 మ్యాచుల్లో 38 సగటుతో 570 తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇవీ చదవండి
‘ఛీటర్‌ స్మిత్‌’! ఇంకా మారలేదా?
దెబ్బ అదుర్స్‌ కదూ: సెహ్వాగ్‌
‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని