కొత్త కేసుల్లో టాప్‌ 10 రాష్ట్రాలివే..  - highest number of daily newcases in several states of india
close
Updated : 20/04/2021 15:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త కేసుల్లో టాప్‌ 10 రాష్ట్రాలివే.. 

దిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత ఐదు రోజులుగా 2లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యా అంతకంతకు పెరుగుతోంది. దీంతో దేశం ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. కొన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. సోమవారం ఒక్కరోజే  దేశ వ్యాప్తంగా 2.59 లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. 1761మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ 10 రాష్ట్రాల్లో మాత్రం అత్యధికంగా కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. 

టాప్‌ 10 రాష్ట్రాలివే..


4 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు
మరోవైపు, కొత్త కేసులు భారీగా నమోదవుతుండటంతో క్రియాశీల కేసుల గ్రాఫ్ పైకి పోతోంది. దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం 8గంటల వరకు 20.31లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసులు 10 రాష్ట్రాల్లోనే భారీగా ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల్లో లక్షకు మించి యాక్టివ్‌ కేసులు ఉండగా.. మరో ఆరు రాష్ట్రాల్లో 65వేలకు మించిన క్రియాశీల కేసులు ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని