కేంద్రం కీలక నిర్ణయం.. చారిత్రక కట్టడాలు మూత!   - historical monuments sites museums closed till may 15
close
Published : 15/04/2021 21:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్రం కీలక నిర్ణయం.. చారిత్రక కట్టడాలు మూత! 

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతుండటంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను మే 15వరకు మూసివేస్తున్నట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

గతేడాది కరోనా తీవ్రరూపం దాల్చిన సందర్భంలో కూడా ఈ కట్టడాలన్నీ మూసివేయగా.. వైరస్‌ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే. తాజాగా గతంలో కంటే వేగంగా కరోనా 2.0 కమ్ముకొస్తోంది. బుధవారం ఒక్కరోజే 2లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్‌ను అదుపు చేసే చర్యల్లో భాగంగా మరోసారి కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను దశల వారీగా ప్రకటిస్తున్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని