భారత విమాన రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధం - hong kong suspends flights connecting india from april 20 to may 3
close
Updated : 19/04/2021 11:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత విమాన రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధం

హాంకాంగ్‌: భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హాంకాంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి తమ దేశానికి విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు హాంకాంగ్‌ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్‌, ఫిలిప్పైన్స్‌ నుంచి విమాన రాకపోకల్ని కూడా నిషేధించింది. ‘భారత్‌, పాకిస్థాన్‌, ఫిలిప్పైన్స్‌ దేశాల నుంచి విమాన రాకపోకల్ని నిషేధించేందుకు నిర్ణయించాం. ఏప్రిల్‌ 20 నుంచి 14 రోజుల పాటు ఆయా దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్‌ విమానాలకు అనుమతి రద్దు చేస్తున్నాం. ఆయా దేశాల్లో కరోనా ముప్పు ఎక్కువగా ఉంది. డిసీజ్‌ కంట్రోల్‌ విభాగం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని హాంకాంగ్‌ ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది.

భారత్‌లో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్‌ తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రోజువారీ కేసులు 2లక్షలకుపైగా.. మరణాలు  వెయ్యికిపైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని