ఇచ్చట శ్మశానవాటిక నిండినది - housefull signboard outside a crematorium | in karnataka
close
Published : 05/05/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇచ్చట శ్మశానవాటిక నిండినది

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ పేషెంట్లతో హాస్పిటల్స్‌ నిండిపోతున్నాయి. శ్మశానవాటికల్లో దహన సంస్కారాలు చేయడానికి కూడా చోటు దొరకనంతగా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే రోజుకు 30 వేలకు పైగా కరోనా కేసులు, సుమారు 200 మరణాలు సంభవిస్తున్న కర్ణాటకలో ఒక శ్మశానంలో కొవిడ్‌తో చనిపోయిన వారిని దహనం చేయడానికి చోటు లేక హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టేశారు.   

బెంగళూరు చామ్‌రాజ్‌పేటలోని ఒక శ్మశానంలో ఒక సారి కేవలం 20 మృతదేహాలను మాత్రమే దహనం చేసేందుకు వీలుంది. ఆదివారం 20 కన్నా ఎక్కువ మృతదేహాలు రావడంతో అక్కడి సిబ్బంది శ్మశాన వాటిక ముందు హౌస్‌ఫుల్‌ బోర్డు తగిలించారు.  అంతిమ సంస్కారాలు చేయడానికి చోటు దొరక్క మృతుల బంధువులు శ్మశానవాటికల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది.

బెంగళూరులో 13 ఎలక్ట్రికల్‌ శ్మశాన వాటికలు ఉన్నాయి. కానీ కొవిడ్‌ మరణాలు పెరగడంవల్ల అవి కూడా ఖాళీ ఉండటం లేదు. కర్ణాటక ప్రభుత్వం తాజా పరిస్థితులను గమనించి తమ పొలాల్లోనూ, ప్లాట్ల దగ్గర దహన సంస్కారాలు చేసుకోవచ్చని మృతుల కుటుంబాలకు సూచించింది.  కాగా కర్ణాటక రాష్ట్రంలో తాజాగా 44,438 కరోనా కేసులు నమోదయ్యాయి. 239 మంది కరోనా బారిన పడి మరణించారు. గడిచిన 24 గంటల్లో 20,901 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని