Pushpa: యాక్షన్‌ సీన్ల కోసం అంత ఖర్చా? - huge amount spending for allu arjun pushpa action scenes
close
Published : 18/04/2021 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pushpa: యాక్షన్‌ సీన్ల కోసం అంత ఖర్చా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘తగ్గేదే లే’ అంటూ ఊరమాస్‌ గెటప్‌లో ‘పుష్పరాజ్‌’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు అల్లు అర్జున్‌. ఆయన కథానాయకుడిగా, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో బన్ని ఎర్ర చందనం స్మగ్లర్‌గా కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన పుష్పరాజ్‌ పాత్రకు సంబంధించిన వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

భారీ బడ్జెట్‌తో మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేసినట్లు టీజర్‌ చూస్తూనే అర్థమవుతోంది. దీనిపై టాలీవుడ్‌లో ఓ టాక్‌ నడుస్తోంది. కేవలం యాక్షన్‌ సన్నివేశాల కోసమే రూ.40కోట్లు ఖర్చు పెడుతున్నారట. పాన్‌ ఇండియా స్థాయి సినిమా కావడంతో ఖర్చు విషయంలో నిర్మాతలు అస్సలు రాజీపడటం లేదని టాక్‌. మరి బన్ని కెరీర్‌లో ‘పుష్ప’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని