యూఎస్‌: 265 లొకేషన్స్‌లో ‘వకీల్‌సాబ్‌’ - huge demand for vakeelsaab movie
close
Published : 02/04/2021 13:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూఎస్‌: 265 లొకేషన్స్‌లో ‘వకీల్‌సాబ్‌’

పవర్‌స్టార్‌ కమ్‌బ్యాక్‌ చిత్రానికి భారీ డిమాండ్‌

లాస్‌ఏంజెల్స్‌: పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘వకీల్‌సాబ్‌’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్‌ నెలకొంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన చిత్రమిదే కావడంతో ‘వకీల్‌సాబ్‌’ను వీక్షించేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ చిత్రానికి ఫుల్‌ డిమాండ్‌ లభిస్తోంది. కేవలం అమెరికాలోనే 265పైగా లొకేషన్స్‌లో ‘వకీల్‌సాబ్‌’ను విడుదల చేయనున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ ప్రకటించింది. ఆ దేశంలో ఏప్రిల్‌ 8న ఈ సినిమా విడుదల కానుంది. అంతేకాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని చాలా ప్రాంతాల్లో  ఏప్రిల్‌ 9న ‘వకీల్‌సాబ్‌’ ప్రదర్శన జరగనుంది.

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘పింక్‌’ రీమేక్‌గా ‘వకీల్‌సాబ్‌’ రూపుదిద్దుకుంది. వేణుశ్రీరామ్‌ దర్శకుడు. బోనీకపూర్‌ సమర్పణలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలకపాత్రలు పోషించారు. అలాగే పవన్‌కు జోడీగా శ్రుతిహాసన్‌ కనిపించనున్నారు. తమన్‌ స్వరాలు అందించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని