హ్యూమా మాటలతో ఏకీభవించను: సోనూ - huma wants iam to be the prime minister of india i dont agree with her: sonu sood
close
Published : 06/06/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హ్యూమా మాటలతో ఏకీభవించను: సోనూ

ఇంటర్నెట్‌ డెస్క్: గత ఏడాది కొవిడ్‌-19, లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడ్డ ఎంతో మంది అసంఘటిత వలస కార్మికులకు సాయం చేశారు బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌. అప్పటి నుంచి ఇప్పుడు కరోనా రెండో దశలోనూ దేశంలో ఎవరైనా సాయం కోరితే.. వెంటనే స్పందిస్తూ ఆపద్భాందవుడిలా ఆదుకుంటున్నాడు. దాంతో చాలామంది ఆయనను వేనోళ్ల పొగిడారు. కొంతమంది అయితే ఆయన ఏకంగా ప్రధాని కావాలని కూడా కోరుకుంటున్నారు. ‘పేట’ నటి హ్యూమా ఖురేషి మాత్రం ‘సోనూ సూద్‌ భారత ప్రధాని కావాలని’ కోరుకుంటోంది. ఖురేషి వ్యాఖ్యలపై సోనూ స్పందిస్తూ..‘‘ఆమె నా గురించి ఇలా చెప్పడం ఆమె మంచి మనసుకు నిదర్శనం. నేను ఈ గౌరవానికి అర్హుడిని అనుకుంటే, నేను తప్పక ఏదైనా మంచి పని చేశాననే చెప్పాలి. కానీ ఆమె చెప్పిన మాటలకి నేను ఏకీభవించను. ఇప్పుడు మనకు సమర్ధవంతమైన ప్రధాని ఉన్నారు. ఇంకా నాకు అంత వయసు కూడా రాలేదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అయితే చిన్నవయసులోనే రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.. అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. ఆయన విశిష్టమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. అయితే నాకు అంత అనుభవం కూడా లేదు. నేను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేని వారు అక్కడ చాలామంది ఉన్నారు. నా గురించి వారు కలత చెందాలని కోరుకోను. నేను నా పని చేయడం చాలా ముఖ్యం. నటుడిగా సంతృప్తిగా రాణిస్తున్నాను. ఇప్పుడు సామాన్యుల కష్టాలలో ఒకడిగా భాగం పంచుకుంటున్నాను. అధికారం, పదవి లేకుండా కూడా మనందరం కలిసి పనిచేయగలమని అనుకుంటున్నా’’నని తెలిపారు. ప్రస్తుతం సోనూసూద్‌ తెలుగులో చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో వస్తున్న ‘పృథ్వీరాజ్‌’ చిత్రంలో కవిగా నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని