Shikhar Dhawan: గౌరవం దక్కిందన్న గబ్బర్‌ - humbled to lead my country dhawan
close
Published : 11/06/2021 18:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shikhar Dhawan: గౌరవం దక్కిందన్న గబ్బర్‌

దిల్లీ: టీమ్‌ఇండియాను నడిపించే అవకాశం రావడం గౌరవమని ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. ఎంతో సంతోషంగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. శుక్రవారం అతడు ట్వీట్‌ చేశాడు. ‘నా దేశాన్ని నడిపించే అవకాశం దక్కినందుకు గౌరవంగా ఉంది. మీ అందరి అభినందనలకు ధన్యవాదాలు’ అని వ్యాఖ్య పెట్టాడు.

శ్రీలంకలో పర్యటించే జట్టును గురువారం రాత్రి సెలక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ యువభారత్‌ ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జులై 13 నుంచి కొలంబో వేదికగా మ్యాచులు జరుగుతాయి. సీనియరైన ధావన్‌ను జట్టుకు సారథిగా ఎంపిక చేశారు. అతడికి భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టెన్‌గా సహాయపడతాడు. ధావన్‌ ఇప్పటి వరకు 34 టెస్టులు, 145 వన్డేలు, 65 టీ2లు ఆడిన సంగతి తెలిసిందే.

తొలిసారి ఐదుగురు కొత్త ఆటగాళ్లకు టీమ్‌ఇండియా నుంచి పిలుపొచ్చింది. కృష్ణప్ప గౌతమ్‌, దేవదత్‌ పడిక్కల్‌, నితీశ్‌ రాణా, రుతురాజ్‌ గైక్వాడ్‌, చేతన్‌ సకారియా తమ కలను నిజం చేసుకోనున్నారు. వీరంతా దేశవాళీ క్రికెట్లోనే కాకుండా ఐపీఎల్‌లో సత్తా చాటారు. కాగా వీరందరూ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. కోచ్‌గా ఎంపికైన ద్రవిడ్‌కు సిరీసులో అందరికీ అవకాశాలు ఇచ్చే అలవాటు ఉండటం గమనార్హం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని