మెట్రో పునఃప్రారంభానికి సర్వం సిద్ధం - hyd metro restarts from september seventh
close
Published : 06/09/2020 14:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెట్రో పునఃప్రారంభానికి సర్వం సిద్ధం

హైదరాబాద్‌: అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను అనుసరించి నగరంలో మెట్రో రైళ్ల ప్రారంభానికి హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెట్రో స్టేషన్లలో, రైళ్లలో అధికారులు  ఏర్పాట్లు చేశారు.

ఈనెల 7వ తేదీ (సోమవారం) నుంచి మెట్రో రైల్‌ సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రయాణికులు మెట్రో స్టేషన్‌లోకి వచ్చిన వెంటనే థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజ్‌ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ప్రయాణికుడిని థర్మల్ ‌స్క్రీనింగ్‌ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తామని సిబ్బంది చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో మెట్రో స్టేషన్లలో టోకెన్ల జారీ ప్రక్రియను పూర్తిగా రద్దు చేశారు. స్మార్ట్‌ కార్డు లేదా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ప్రయాణించే అవకాశం కల్పించారు. కౌంటర్‌ వద్ద కూడా భౌతికదూరం పాటించే విధంగా మార్కింగ్‌ వేశారు. రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని నిర్ణయించారు. మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లు సమకూర్చారు. సీసీటీవీల ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణికుల రాకపోకలను గమనిస్తూ భౌతికదూరం పాటించని వారిని అప్రమత్తం చేస్తామని అధికారులు వెల్లడించారు.  రైళ్లలో సీటింగ్‌ విధానంలో కూడా మార్పులు చేశారు. ప్రతి బోగీలో ప్రయాణికులు నిల్చునే, కూర్చునే చోట మార్కింగ్‌ వేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని