నేనూ ఎంతో మందికి సాయం చేస్తున్నా: కంగన - i am also helping some many people says kangana
close
Updated : 01/05/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేనూ ఎంతో మందికి సాయం చేస్తున్నా: కంగన

నెటిజన్‌పై నటి ఫైర్‌

ముంబయి: సాయం చేయడానికి సోషల్‌మీడియా ఒక్కటే వేదిక కాదని నటి కంగనా రనౌత్‌ అన్నారు. తరచూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగనా తాజాగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా ఎంతోమందికి సాయం చేస్తున్నానని.. తాను చేస్తున్న సాయం గురించి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టి పబ్లిసిటీ పొందాల్సిన అవసరం తనకి లేదని ఆమె అన్నారు.

‘ప్రియాంక చోప్‌ఢా, ఆలియాభట్‌, తాప్సీ, ఇతర నటీనటులు మాదిరిగా కొవిడ్‌ బాధితులకు సాయం చేయడం కోసం కాకుండా కంగన తన ట్విటర్‌ ఖాతాను భాజపా ప్రభుత్వాన్ని ప్రశంసించడం కోసమే ఉపయోగిస్తున్నారు’ అని ఇటీవల ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. కాగా, తాజాగా ఆ ట్వీట్‌ చూసిన కంగన.. ‘ప్రజలకు సాయం చేయాలంటే ట్విటర్‌ ఒక్కటే వేదిక కాదు. దానికి వేరే మార్గాలు ఎన్నో ఉన్నాయి. నేను కూడా ఎంతోమందికి ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులు, వ్యాక్సిన్‌లతోపాటు ఆస్పత్రుల్లో అవసరమైన పడకలను ఏర్పాటు చేయించాను. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో తెలిసిన ఎంతోమంది నన్ను సాయం కోరారు. వారందరికీ నావంతు సాయం అందించా. ఇదంతా నేను పబ్లిసిటీ కోసం చేయడం లేదు’’ అని కంగన ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌ వేదికగా సెలబ్రిటీలను సాయం కోరే వారిలో కొంతమంది ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులను బ్లాక్‌ మార్కెట్‌లో వేరే వాళ్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని