కెప్టెన్సీతో పంత్‌కు ఎలా లాభమంటే..! - i am convinced that captaincy will make pant a better player ponting
close
Published : 31/03/2021 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కెప్టెన్సీతో పంత్‌కు ఎలా లాభమంటే..!

మరింత మెరుగవుతాడన్న రికీ పాంటింగ్‌

(Twitter/Delhicapitals)

ముంబయి: నాయకత్వం చేపట్టడం వల్ల రిషభ్ పంత్‌ మరింత మెరుగైన క్రికెటర్‌గా ఎదుగుతాడని దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు. తాజా ప్రదర్శనల దృష్ట్యా కెప్టెన్సీకి అతడు అర్హుడేనని పేర్కొన్నాడు. ఈ మేరకు రికీ ట్వీట్‌ చేశాడు.

దిల్లీ క్యాపిటల్స్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ ఇంగ్లాండ్‌ సిరీస్‌లో గాయపడ్డాడు. ఫీల్డింగ్‌ చేస్తుండగా అతడి భుజం స్థానభ్రంశమైంది. వైద్యబృందం సూచనల మేరకు వన్డే సిరీస్‌కే కాకుండా ఐపీఎల్‌ సీజన్‌కూ పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వికెట్‌కీపర్‌ రిషభ్ పంత్‌ను దిల్లీ యాజమాన్యం సారథిగా ప్రకటించింది.

‘శ్రేయస్‌ ఐపీఎల్‌కు దూరమవ్వడం దురదృష్టకరం. రిషభ్‌ఫంత్‌ తనకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడని భావిస్తున్నా. తాజా ప్రదర్శనలు, మొక్కవోని ఆత్మవిశ్వాసం దృష్ట్యా నాయకత్వం చేపట్టేందుకు అతడు పూర్తిగా అర్హుడు. సారథ్యం పంత్‌ను మరింత మెరుగైన ఆటగాడిగా మారుస్తుందని నేను అంగీకరిస్తున్నా’ అని రికీ పాంటింగ్‌ ట్వీట్‌ చేశాడు.

ఆస్ట్రేలియా పర్యటన నుంచి రిషభ్‌ పంత్‌ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మూడో టెస్టులో 97, నాలుగో టెస్టులో 89తో అదరగొట్టాడు. ఇక ఇంగ్లాండ్‌పైనా అదే జోరు కనబరిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఆఖరి రెండు వన్డేల్లో వరుసగా అర్ధశతకాలు సాధించాడు. ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌ 2021లోనూ కొనసాగించాలని దిల్లీ క్యాపిటల్స్‌ ఆశిస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని